విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,మార్చి 10(జనంసాక్షి):
నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండల పరిధిలోని ఖానాపూర్ లోని ప్రాథమికోన్నత పాఠశాలలో గురువారం విద్యార్థులే ఉపాద్యాయులయినారు.పాఠశాలలో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించుకున్నారు.డిఈఓగా సోనీ, ఎంఇఓ గా భవాని, ప్రధానోపాధ్యాయులు గా మాధవి మరియు వీరితోపాటు 30మంది విద్యార్థులు ఉపాధ్యాయులు గా వ్యవహరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మండల విద్యాశాఖాధికారి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ చిన్నప్పటినుండే క్రమశిక్షణ అలవర్చుకుంటూ,మంచి పద్ధతిలో చదువుకుంటే భవిష్యత్తులో భావిభారత పౌరులుగా ఎదగవచ్చునన్నారు. గ్రామస్థాయిలో నిరక్షరాస్యులు చాలా మంది ఉన్నారని అక్షరాస్యులుగా మార్చే బాధ్యత సమాజంలో ఉపాధ్యాయులతో పాటు ప్రతి పౌరునికి ఉంటుందని అన్నారు.విద్యార్థులు వారు బోధించినటువంటి వివిధ అంశాలను వారి యొక్క అనుభవాలను చాలా చక్కగా వివరించారని అభినందించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యాయులు జె.కృష్ణ,సుగుణ కుమారి, వెంకటనర్సమ్మ, గ్రామ సర్పంచ్ సితార, ఎస్ ఎంసీ చైర్మన్ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.