విద్యార్థుల ఉత్తీర్ణతా శాతం పెంచేందుకు ప్రణాళిక
కరీంనగర్, నవంబర్ 15 (: రాబోయే నాలుగు నెలలకు సంబంధించి ఉన్నత పాఠశాల విద్యార్థులు వార్షిక పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టరేట్ అడిటోరియంలో జిల్లాలోని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో విద్యాశాఖ పర్‌ఫార్మెన్స్ ట్రాఫింగ్‌పై డివిజన్ వారీగా పాఠశాలలకు కలెక్టర్ సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే నాలుగు నెలలకు సంబంధించి విద్యాబోధన కార్యాచరణ ప్రణాళిక ఈ నెల 20లోగా రూపొందించి సంబంధిత డిప్యూటీ విద్యాధికారిణి పంపించాలన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సబ్జెక్టు పరంగా వెనకబడిన సి కేటగిరిలో ఉన్న విద్యార్థులపై సంబంధిత సబ్జెక్టు టీచర్‌లు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. తల్లిదండ్రుల కమిటీ సమావేశాలు రెగ్యులర్‌గా ఏర్పాటు చేసి విద్యార్థుల విద్యాప్రగతికి వారికి సమాచారం తెలపి, ఎప్పటికప్పుడు మెరుగైన చర్యలు తీసుకోవాలని సూచించారు.