విద్యార్థుల సామర్థ్యాలను వెలికితీసేవిధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్.గోవిందరాజులు సూచన

నాగర్ కర్నూల్ ఆర్సీ మార్చి03(జనంసాక్షి):మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పాఠశాలల మౌళిక సదుపాయాల కల్పన పనులు,విద్యార్థుల సామర్ధ్యాలను పరిశీలించేందుకు తనిఖీ చేసేందుకు శుక్రవారం డిఈవో తెలకపల్లి,పెద్దకొత్తపల్లి మండలాల్లోని గౌరెడ్డిపల్లి,తెలకపల్లి,పెద్దూరు,ముష్టిపల్లి,మరికల్,పెద్దకొత్తపల్లి ప్రాథమిక మరియు ఉన్నత   పాఠశాలాలను ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ సందర్భంగా డిఈవో పాఠశాలల్లో విద్యార్థులతో మాట్లాడి వారి విద్యాప్రమాణాలను పరిశీలించారు.ప్రతి విద్యార్థిలో తనదైన ఒక శక్తి సామర్థ్యం ఉంటుందని ఉపాధ్యాయులు బోధించే సందర్భంలో  విద్యార్థుల శక్తి సామర్థ్యాలను గుర్తించి వెలికి తీయడమే కాకుండా అందులో వారిని మరింత ప్రోత్సహించాలని ఉపాధ్యాయులను సూచించారు.పాఠశాలకు విద్యార్థులు ప్రతి రోజు వచ్చేటట్లు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.పాఠశాలలో 3,4,5వ తరగతి విద్యార్థులతో ప్రశ్నలు అడిగి జవాబులు రాబట్టారు.ప్రతి విద్యార్ధికి యాక్షన్ ప్లాన్ ను తయారు చేయాలని అప్పుడే విద్యార్ధి యొక్క సామర్త్యాలు తెలుస్తుందన్నారు.విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనాన్ని ఆయన పరిశీలించారు వంట గదిని,అక్కడి పరిశుభ్రతను పరిశీలించారు.విద్యార్థులకు పౌష్టిక ఆహారాన్ని అందించాలని సూచించారు.కోడిగుడ్లను మెనూ ప్రకారం ఇవ్వాలన్నారు.10వ తరగతి విద్యార్థులతో మమేకమై వారానికి ఒకసారి వారికి టెస్ట్ లను పెడుతున్నారా,సాయంత్రం సమయంలో వారికి ప్రతి రోజు ఓ సబ్జెక్టు పై స్టడీ అవర్స్ నిర్వహిస్తూ అల్పాహారాన్ని పెడుతున్నారా లేదా అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు.ఈ సంవత్సరంలో 10వ తరగతి విద్యార్థులందరు  10/10 సాధించాలని విద్యార్థులకు  సూచించారు.విద్యార్థులు తప్పని సరిగా 10/10 సాధిస్తామని జిల్లా డిఈవో కు హామీ ఇచ్చారు.విద్యార్థులు సమయాన్ని వృధా చేయకుండా అంకితభావంతో పది పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు.ఆయా పాఠశాలల్లో మన ఉరు మన బడి కార్య క్రమంలో భాగంగా చేపట్ట వలసిన పనులను త్వరిత గతిన పూర్తి చేయాలనీ వాటర్ సంపు,లైటింగ్ మరియు ప్రహరి గోడల నిర్మాణం పనులను త్వరితగతిన పూర్తి చేయాలనీ ఆదేశించారు.పెద్దకొత్తపల్లి(కేజిబివి)లో విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు.కేజీబీవీలో పరిసరాలను పరిశీలించి,నాణ్యమైన రుచికరమైన మెనూ ప్రకారం భోజనాన్ని అందించాలని,విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని వస్తువులను కల్పించాలని యస్.ఓను ఆదేశించారు.డీఈఓ వెంట మండల విద్యాధికారి చంద్రుడు నాయక్ ఉన్నారు.