విద్యార్ధులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి

జనగామ జూన్‌ 18జనంసాక్షి :
విధ్యార్ధులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని మండలం లోని వీరన్న పేట గ్రామ పాఠశాల ప్రధానోపాద్యాయులు ముస్త్యాల పుష్పా ఆన్నారు. సోమవారం వీరన్న పేట గ్రామంలో ఉపాద్యా బృందం ఆద్వర్యంలో ఇంటింటికి తిరిగి పిల్లలను ప్రబుత్వ పాఠశాలలో చేర్పించాలని ప్రచారం నిర్వహించారు.ఆనంతరం వారు మాట్లాడుతు ప్రభుత్వ పాఠశాలలో నైపుణ్యం గల ఉపాధ్యాయులచే నాణ్యమైన విధ్యా బోదన జరుగుతుందని,ప్రతి విధ్యార్ధిపై వ్యక్తిగత శ్రద్ద తీసుకొని విధ్యాబోదన చేస్తామని,విధ్యార్ధులకు ఉచిత దుస్తులు,పుస్తకాలతో పాటు నాణ్యమైన బోజనం పెట్టడం జరుగుతుందని ఆన్నారు.ప్రైయివేటు పాఠశాలలో మాదిరిగా బట్టి పద్దతిలో కాకుండా విషయ ఆవగాహణ ప్రాధాన్యత ఇచ్చేవిదంగా బోదించడం జరుగుతుందని ఆన్నారు.వీరితో పాటు ఉపాధ్యాయులు ఆచ్యుతెందర్‌,నరెందర్‌,రాజు,ప్రవీణ్‌ తోపాటు ఉపాద్యాయ బృందం పాల్గొన్నారు.