విద్యా రంగానికి ప్రాధాన్యం

జమ్మికుంట (కరీంనగర్‌): దేశ రక్షణకు సమానంగా విద్యా రంగానికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని కరీంనగర్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ఎంపీ మాట్లాడుతూ కరీంనగర్‌ లోక్‌సభ పరిధిలో 28 మండలాల్లో రూ.3.22 కోట్లతో బాలికల మోడల్‌ పాఠశాలలను నిర్మిస్తామన్నారు. టేకుర్తిలో రూ.1.28 కోట్లతో నిర్మించనున్న బావికల నమూనా వసతి గృహ నిర్మాణానికి హుజురాబాద్‌ ఎల్‌ఎల్‌ఏ ఈటెల రాజేందర్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఒక్కో పాఠశాలకు రూ.1.28 కోట్లు వచ్చిస్తామన్నారు. విద్య సంక్షేమ శాఖ జిల్లా ఈఈ షఫీయుద్దీన్‌, డీప్యూటీ ఈఈ మహేందర్‌ రెడ్డి, మండల టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.