విద్యుత్‌ అధికారులతో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష

హైదరాబాద్‌: విద్యుత్‌ అధికారులతో సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. విద్యుత్‌ కోతల్లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. నెలాఖరుకల్లా 800 మెగావాట్ల విద్యుత్‌ ఎన్‌టీపీసీ నుంచి కేటాయిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. మరో 100 మెగావాట్ల బెజ్జర్‌ కేంద్రం నుంచి రాష్ట్రానికి మళ్లించనున్నారు.