విద్యుత్‌ తీగలు తగిలి ఇద్దరు రైతుల మృతి

తాళ్లపూడి: పంటపొలంలో పనిచేస్తున్న రైతులు విద్యుత్‌ తీగలు తగిలి ప్రమాదానికి గురైన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడిలో చోటుచేసుకుంది. ఈఘటనలో ఇద్దరు రైతులు అక్కడికక్కడే మృతి చెందారు. ఉదయం వ్యవసాయ పనులు చేస్తుండగా తెగిపడిన విద్యుత్‌ తీగలు తగలడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు తెలియజేశారు.