విద్యుత్‌ తీగలు తెగిపడి ఇద్దరు మృతి

నెల్లూరు: బొగుల మండలం జువ్వలదిన్నెలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్‌ తీగలు తెగిపడి ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. జువ్వలదిన్నెలో పెళ్లి కార్యక్రమం చూసుకొని లారీలో నిద్రిస్తున్న వారిపై విద్యుత్‌ తీగలు తెగిపడటంతో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. మృతులు ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పి. పట్టపుపాలెం మత్స్యకారులు.