విద్యుత్ సంక్షోభానికి పదిరోజుల్లో పరిష్కారం: ముఖ్యమంత్రి
హైదరాబాద్: దక్షిణ భారత పరిశ్రమల సమాఖ్య సదస్సులో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశానికి దక్షిణ భారతానికి చెందిన పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. ఈసందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి పదిరోజుల్లో పరిష్కారం లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. 2,700 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యానికి 70 శాతం మాత్రమే గ్యాస్ సరఫరా అవుతుందని ఆయన తెలియజేశారు.