విద్యుత్‌ సమస్యపై సీఎం సమీక్ష

హైదరాబాద్‌: రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్‌ సమస్యపై ఈరోజు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమీక్ష జరిపారు. సచివాలయంలో సీఎస్‌, సీఎం కార్యాలయం కార్యదర్శులతో ఆయన సమావేశమయ్యారు. కేంద్రాన్ని కోరిన అదనపు విద్యుత్తును త్వరతగతిన వచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఎస్‌ను ఆదేశించారు. రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌, వినియోగం, రిజర్వాయర్ల నీటి నిల్వలపై అధికారులను ఆయన వివరణ కోరారు. రాష్ట్రంలో ప్రస్తుతం 35మిలియన్‌యూనిట్ల కొరత ఉందని అధికారులు సీఎంకు వివరించారు. 9,295వ్యవసాయ ఫీడర్లకు నిరంతరాయంగా 7గంటల ఉచిత విద్యుత్‌ను అందజేస్తామని అధికారులు ఆయనకు చెప్పారు. 13వ్యవసాయ ఫీడర్లకు మాత్రమే విద్యుత్‌ అంతరాయం ఉందని వారు సీఎంకు తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలవల్ల తుంగభద్ర నదికి ఇన్‌ఫ్లో సీఎంకు అధికారులు వివరించారు.