విద్యుత్‌ సమస్యలపై భేటీ కానున్న తెదేపా

హైదరాబాద్‌: రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్‌ సమస్యలపై తెదేపా ఎమ్మెల్యేలు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌లో నేడు భేటీ కానున్నారు. అప్రకటిత విద్యుత్‌ కోతలు, విద్యుత్‌ ఛార్జీల భారం, అధినేత పాదయాత్రలో ప్రజల నుంచి విద్యుత్‌ సమస్యలపై వచ్చిన ఫిర్యాదులపై నేతలు చర్చించనున్నారు. సమావేశం అనంతరం ఖైరతాబాద్‌లోని విద్యుత్‌ సౌధకు వెళ్లి ఉన్నతాధికారులను కలిసి తక్షణమే సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించనున్నారు.