వినూత్న ఆలోచనలతో వ్యాపార రంగంవిస్తరించాలి
విస్తరించాలివినూత్న ఆలోచనలతో వ్యాపార రంగం
– మంత్రి జగదీష్ రెడ్డి
సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): కొత్త కొత్త ఆలోచనలతో వ్యాపార రంగంలో విస్తరించి ప్రజల మన్ననలను పొంది, ఆదాయ మార్గాలు పెంచుకోవాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.జిల్లా కేంద్రంలో ఆదివారం రాత్రి జరిగిన రెడ్ బకెట్ బిర్యానీ అవార్డుల కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రెడ్ బకెట్ బిర్యానీ అనగానే కార్పొరేట్ సంస్ధ అనుకున్నామని అన్నారు.సూర్యాపేటకు చెందిన హోటల్ రంగంలో అనుభవం గడించిన అబ్దుల్ బారి రెండు తెలుగు రాష్ట్రాలలో 115 బ్రాంచిలు ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు.నేడు ప్రతి ఒక్కరూ ఇంగ్లీషు బ్రాండెడ్ వస్తువులు, కాఫీలు, చికెన్ సెంటర్ల పట్ల మొగ్గు చూపుతున్నారని, విదేశీ బ్రాండెడ్ వస్త్రాలకు అధిక ధరలు చెల్లించి కొనుగోలు చేస్తున్నారని, అంతకంటే నాణ్యతగల వస్త్రాలు స్ధానిక మార్కెట్ లో లభించినప్పటికీ ఆదరణ లేదన్నారు.సూర్యాపేటలో వ్యాపారం ప్రారంభించి, తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాలలో 115 శాఖలుగా విస్తరించిన రెడ్ బకెట్ బిర్యానీ వ్యవస్ధాపకులు అబ్దుల్ బారికి అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల యజమానులకు అవార్డులు అందజేశారు.కార్యక్రమంలో పాటలు, డ్యాన్స్ లతో ఉత్సాహంగా నిర్వహించారు.రెడ్ బకెట్ బ్రాండ్ అంబాసిడర్ మేఘన కుమారి, సినీ నటుడు కొనిదెల పవన్ తేజ్ లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్,మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్, యజమానులు అబ్దుల్ బారి, జువేద్, ఎండి ఉబేద్ తదితరులు పాల్గొన్నారు.