విమాన గోపుర స్వర్ణతాపడం కోసం 2కిలోల బంగారం

share on facebook

ఇచ్చిన హావిూ మేరకు ఎమ్మెల్యే మర్రి అందచేత

యాదాద్రి భువనగిరి,నవంబర్‌26 (జనంసాక్షి):   యాదాద్రి ప్రధాన ఆలయ విమాన గోపురం స్వర్ణ తాపడానికి నాగర్‌ కర్నూల్‌ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌ రెడ్డి రెండు కిలోల బంగారాన్ని విరాళంగా అందజేశారు.  సిఎం సమక్షంలోనే ఆయన గతంలో ఈ విరాళం ప్రకటించారు. హావిూ మేరకు బంగారాన్ని ఆలయానికి అప్పగించారు. శుక్రవారం కుటుంబ సమేతంగా ఆలయ శ్రీస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి వేదాశీర్వచనం చేశారు. అంతకు ముందు ఆలయ మర్యాదాలతో సంప్రదాయబద్దంగా ఆయనకు స్వాగతం లభించింది. ఆలయ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం కావడం తమ అదృష్టంగా భావిస్తున్నామని జనార్దన్‌ రెడ్డి తెలిపారు. అనంతరం ఆలయ పునర్నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఆలయ ఈవో ఎన్‌ గీత తదితరులు పాల్గొన్నారు.

Other News

Comments are closed.