విలాస్‌రావుకు వెంటిలేటర్‌పై చికిత్స

చెన్నై: కేంద్రమంత్రి విలాస్‌రావ్‌ దేశ్‌ముఖ్‌కు వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే ఈ రోజు ఆయన పరిస్థితి కొంత మెరుగైనట్లు చెన్నైలోని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం కిడ్ని, కాలేయానికి సంబంధించిన మందులు ఇస్తున్నారు. బుధవారం ఆయన్ను మహారాష్ట్రలోని ముక్తంబర్‌ ఎంపీ విలాస్‌ ముక్తంబర్‌ పరామర్శించారు.