విశాఖస్టీల్స్‌లో సమ్మె నోటీసు

విశాఖపట్నం : విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘం సోమవారం సమ్మె నోటీసు ఇచ్చింది. పెట్టుబడుల ఉపసంహరణను ఈ నెల 25న అధికారకంగా ప్రకటించనున్నారు. దీంతో 24 నుంచి సమ్మె చేపడుతున్నట్లు కార్మిక సంఘం నోటీసులో పేర్కొంది.