విశాఖ కర్మాగారంలో సమ్మె విజయవంతం

విశాఖపట్నం: విశాఖ ఉక్కు కర్మాగారంలో పెట్టుబడుల ఉపసంహరణను నిరసిస్తూ కార్మికవర్గాలు చేపట్టిన సమ్మె విజయవంతమైంది. ప్లాంటులోని 14 వేల మంది శాశ్వత కార్మికులతో పాటు 20 వేలమంది ఒప్పంద కార్మికులు కూడా సమ్మెలో పాల్గొన్నారు. దీంతో ప్లాంటులో ఉత్పత్తి నిలిచిపోయింది. లాభాల్లో ఉన్న కర్మాగారాన్ని ప్రైవేటు పరంచేసేందుకు వాటాల విక్రయానికి పాల్పడుతున్నారని కార్మికసంఘాల నేతలు ఆరోపిండారు. పెట్టుబడుల ఉపసంహరణ ప్రకటనను విరమించుకోకుంటే ఆందోళనను తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు