వీఆర్ఏలకు మద్దతుగా శాలివాహన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు
నాంపల్లి సెప్టెంబర్ 27 (జనంసాక్షి )నాంపల్లి మండలం లోని తాసిల్దార్ కార్యాలయం ముందు వీఆర్ఏలు చేస్తున్న 65వ రోజు నిరవధిక సమ్మె చేస్తున్న వారికి శాలివాహన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిలుకూరి బిక్షం మద్దతు తెలుపి మాట్లాడుతూ న్యాయమైన వారి డిమాండ్లను వెంటనే పరిష్కరించాలనిన్నారు. రెగ్యులర్, పే స్కేల్ మంజూరు చేయడం, వారసత్వం నియామకాలు కల్పించడం అనేవి కనీస హక్కుల గా భావించారు. ఈ కనీస హక్కులను సాధించుకునే ఎంతవరకు ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామనిన్నారు.