వీఆర్ఏల సమ్మెకు మద్దతు తెలిపిన. బిర్ల ఐలయ్య

యదాద్రిజిల్లా తుర్కపల్లి మండలం (జనంసాక్షి) సెప్టెంబర్02/09/22.
 వి ఆర్ ఏ ల  సమ్మెలో మద్దతు తెలిపి మాట్లాడుతున్న బీర్ల ఐలయ్య
తుర్కపల్లి మండల కేంద్రంలో వీఆర్ఏలు చేస్తున్న నిరవర్దిక సమ్మెలో  ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ బీర్ల ఐలయ్య శుక్రవారం మద్దతు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వి.ఆర్.ఏల పే స్కేల్ జి.ఓ ని  వెంటనే విడుదల చేయాలనీ డిమాండ్ చేశారు.అర్హత కలిగిన వి.ఆర్.ఏ లకు పదోన్నతులు కల్పించాలన్నారు.55 సం||లు నిండిన వి.ఆర్.ఏల స్థానంలో వారి  వారసులకు వి.ఆర్.ఏ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేసారు.
మరణించిన వి.ఆర్. ఏ ల స్థానంలో కారుణ్య నియామకం చేపట్టాలని కోరారు.VRA లకు ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు.బొమ్మలరామరం మండలం తిరుమలగిరి కి చెందిన విఆర్ఏ భిక్షపతి కలెక్టరేట్ లో జరిగే నిరసన కు వెళ్తున్న సందర్భంలో రోడ్డు ప్రమాదం లో మరణించడం చాలా బాధాకరమని ఆన్నారు.
మరణించిన విఆర్ఏ కుటుంబన్నీ పరామర్శించి ఆర్థిక సహాయం కూడా అందించమన్నారు .రాబోవు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తప్పకుండా VRA లకు అండగా ఉంటుందనని అన్నారు.
వీఆర్ఏలు చేసిన సేవలు మర్చిపోయి ప్రభుత్వం ఈరోజు వీఆర్ఏలను దిక్కుతోచని స్థితిలో వదిలిపెట్టడం ఎంతవరకు సమంజసం అని అన్నారు
గత ప్రభుత్వాలు వీఆర్ఏలతో పని చేయించుకున్నాయి కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కెసిఆర్ మొండివైఖరిని స్పష్టంగా కనిపించిందని అన్నారు.
 ఈకార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ధనావత్ శంకర్ నాయక్, ప్రధాన కార్యదర్శి చాడ భాస్కర్ రెడ్డి, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ధనావత్ భాస్కర్ నాయక్ ,ఎంపీటీసీలు కానుగంటి శ్రీనివాస్ యాదవ్ ,మోహన్ బాబు, ప్రతిభా రాజేష్ ,సర్పంచు బిచ్చు నాయక్ గ్రామ శాఖ అధ్యక్షులు సోమల్ల వెంకటేష్, దొమ్మాట బాబు నాయకులు బో రెడ్డి మైపాల్ రెడ్డి బీసీ సెల్ మండల అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్,కాంగ్రెస్ పార్టీ నాయకులు బొల్లారం జగదీష్, పాముల రాజు ఎన్ ఎస్ యూ ఐ అధ్యక్షుడు సాయి నిఖిల్ గౌడ్ , వీఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు