వీహెచ్‌పై చర్యలు తీసుకోవాలని ఆజాద్‌కు లేఖ

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ సీనియర్‌  నేత వి. హనుమంతరావుపై  పలువురు ఎమ్మెల్యేలు అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. ఆయన తీరును నిరసిస్తూ  ఎమ్మెల్యేలు జోగి రమేష్‌,  మల్లాది విష్ణు పార్టీ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు ఆజాద్‌కు లేఖ రాశారు. తిరుపతిలో వీహెచ్‌ దీక్ష కారణంగా పార్టీకి తీరని నష్టం జరిగిందని వారు ఆ లేఖలో పేర్కొన్నారు. ఆయనపై వెంటనే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కోరారు.