వుహాన్‌ కుక్కల నుంచి మనుషులకు సోకిన కరోనా?

` నిర్దారించిన శాస్త్రవేత్తల బృందం
న్యూయార్క్‌(జనంసాక్షి):చైనాలోని వుహాన్‌ చేపల మార్కెట్‌లో విక్రయించిన రాకూన్‌ జాతి కుక్కల జన్యుపదార్థంలో కొవిడ్‌ కారక సార్స్‌కోవ్‌`2 వైరస్‌ ఆనవాళ్లు కనిపించాయని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం తెలిపింది.దీన్నిబట్టి కొవిడ్‌ కారక కరోనా వైరస్‌ ప్రయోగశాలలో కృత్రిమంగా సృష్టించినది కాదనీ, అది ప్రకృతిలో సహజంగానే ఉత్పన్నమై ఉండవచ్చని వారు భావిస్తున్నట్లు ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ దినపత్రిక తెలిపింది. వైరస్‌ ప్రయోగశాల నుంచి లీకై ఉండవచ్చని అమెరికా ఇంధనశాఖ అంచనా వేసిన కొన్ని వారాలకే దానికి విరుద్ధమైన అంచనాను అంతర్జాతీయ శాస్త్రవేత్తలు వెలువరించడం విశేషం.వుహాన్‌లోని హువానాన్‌ టోకు చేపల మార్కట్‌ నుంచి కొవిడ్‌ వైరస్‌ వ్యాపించిందనే అనుమానంతో చైనా అధికారులు 2020 జనవరిలో ఆ మార్కెట్‌ను మూసివేశారు. ఆ సమయంలో చైనా శాస్త్రజ్ఞులు మార్కెట్‌ నుంచి జన్యు నమూనాలను సేకరించారు. అప్పటికే మార్కెట్‌ నుంచి జంతువులను తొలగించినందున అక్కడి ఖాళీ బోనులు, గోడలు, గచ్చు, బండ్ల విూద నుంచి జన్యు నమూనాలు సేకరించి జీనోమ్‌ సీక్వెన్స్‌ను అంతర్జాతీయ ఏవియన్‌ ఫ్లూ సమాచార మార్పిడి వేదికలో ఉంచారు. వుహాన్‌ మార్కెట్‌లో ఒక బండిపై పక్షుల పంజరం ఉంచగా.. వేరే బోనులో రాకూన్‌ కుక్కలను ఉంచినట్లు శాస్త్రజ్ఞుల దృష్టికి వచ్చింది. ఇది ఒక జంతువు నుంచి మరో జంతువుకు వైరస్‌ వ్యాపించడానికి అనువైన స్థితి. అక్కడ సేకరించిన జన్యు నమూనాలో రాకూన్‌ కుక్క న్యూక్లిక్‌ ఆమ్లం, వైరస్‌ న్యూక్లిక్‌ ఆమ్లం కలిసి ఉన్నాయని కనిపెట్టారు. ఒకవేళ రాకూన్‌ కుక్కకు కొవిడ్‌ వైరస్‌ సోకినా దాని నుంచి అది నేరుగా మానవులకు వ్యాపించి ఉండకపోవచ్చనీ, అసలు మానవుల ద్వారానే కుక్కకు వైరస్‌ సోకి ఉండవచ్చనీ శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. మరేదైనా జంతువు నుంచి కూడా రాకూన్‌ కుక్కకు కొవిడ్‌ వైరస్‌ సోకి ఉండవచ్చంటున్నారు. ప్రస్తుతానికి జంతువుల నుంచే మానవులకు వైరస్‌ సోకిందని అనుకోడానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ప్రపంచంలో మొట్టమొదటి కరోనా వైరస్‌ కేసు 2019లో చైనాలోని వుహాన్‌ రాష్ట్రంలో నమోదైంది.

(దేశంలో మరోమారు కరోనా బెల్స్‌
` 800 దాటిన కేసుల సంఖ్య
` రాష్ట్రాలను హెచ్చరించిన కేంద్రం)
న్యూఢల్లీి(జనంసాక్షి): దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. 126 రోజుల తర్వాత.. రోజువారీ కేసుల నమోదు ఎనిమిది వందలు దాటటంతో.. అలర్ట్‌ ప్రకటించింది కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ. ప్రతి రోజూ బాధితులు పెరుగుతూ ఉండటంపై.. అన్ని రాష్టాల్రను అప్రమత్తం చేస్తోంది. జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తుంది. వాతావరణ మార్పులు.. ఇతర వైరస్‌ లతో జనం ఇబ్బంది పడుతున్న సమయంలోనే.. కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశమే.2023, మార్చి 17వ తేదీ శుక్రవారం నాటికి దేశవ్యాప్తంగా 5 వేల 389 మంది కరోనాకు చికిత్స తీసుకుంటున్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్‌ రాష్టాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. యాక్టివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్నా.. కోలుకుంటున్న వారి సంఖ్య అదే స్థాయిలో ఉందని.. మరణాల రేటు అతి స్వల్పంగా ఉందని స్పష్టం చేసింది. ఇన్ఫెక్షన్‌ రేటు.. వ్యాప్తి రేటు జీరో పాయింట్‌ జీరో వన్‌ శాతంగానే (0.01శాతం) ఉందని వెల్లడిరచింది. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ కింద.. ఇప్పటి వరకు 220 కోట్ల డోసులు ఇవ్వటం జరిగిందని వివరించింది. 126 రోజుల తర్వాత రోజువారీ కరోనా కేసుల నమోదు 800కు చేరుకోవటం ఇదే అని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ వివరించింది.