వృత్తి విద్యా కళాశాలలపై నియంత్రణ సరికాదు

హైదరాబాద్‌: వృతి విద్యా కళాశాలలపై  నియంత్రణ కోసం ప్రభుత్వం ఏర్పాటుచేసిన టాస్క్‌ఫోర్స్‌ను వ్యతిరేకిస్తున్నామని కళాశాలల   యాజమాన్యాల సంఘం ప్రతినిధి కె.వి.కె. రావు పేర్కొన్నారు. ప్రభుత్వంతో జరిగే తుది దశ చర్చల్లో బోధనా రుసుంపెంపుపై సానుకూల నిర్ణయం వెలువడుతుందని ఆశిస్తున్నట్లు  చెప్పారు. ప్రస్తుతం దేశంలో ఉన్న వృత్తివిద్యా కళాశాలలు ఏఐసీటీఈ నిబంధనలకు అనుగుణంగా ఏమీలేవని అన్నారు. ఈ దశలో రాష్ట్రంలో వృత్తి విద్యా కళాశాలలు ఏఐసీటీఈ నిబంధనలకు అనుగుణంగా  ఏమీలేవని అన్నారు. ఈ దశలో రాష్ట్రంలో వృత్తి విద్యా కళాశాలలపై ప్రభుత్వ నియంత్రణ సరికాదని ఆయన వ్యాఖ్యానించారు.