వేణుగోపాలచార్యులకు ఉగాది పురస్కారం

వేణుగోపాలచార్యులకు ఉగాది పురస్కారం
సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఇచ్చే ఉగాది పురస్కారములలో భాగంగా జిల్లా కేంద్రంలోని సుప్రసిద్ధ వేంకటేశ్వర స్వామి దేవస్థాన ప్రధాన అర్చకులు నల్లాన్ చక్రవర్తుల వేణుగోపాలాచార్యులకు ఉగాది పురస్కారాన్ని అందుకున్నారు.బుధవారం హైదరాబాదులోని రవీంద్రభారతిలో జరిగిన ఉగాది ఉత్సవాలలో భాగంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చేతుల మీదుగా వేణుగోపాలచార్యులు ఉగాది పురస్కారాన్ని అందుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో జిల్లా , రాష్ట్రస్థాయిలో ఎన్నో బిరుదులు పొందినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంచే రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఆర్చకుడిగా పొందిన ఈ పురస్కారం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు.ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ అర్చకులను, బ్రాహ్మణులను తగు రీతిలో గుర్తించి వారిని ప్రోత్సహిస్తున్నారని అన్నారు.మంత్రి జగదీష్ రెడ్డి సూర్యాపేట నియోజకవర్గం లోని ప్రజలందరినీ సమదృష్టితో చూస్తూ ప్రోత్సహిస్తున్నారని తెలిపారు.రాష్ట్రంలోని దేవాలయాల అర్చకులందరూ నేడు ఆనందంగా ఉండగలుగుతున్నారని అన్నారు.తమ సేవలను గుర్తించి రాష్ట్రస్థాయిలో ఈ పురస్కారాన్ని ఇచ్చినందుకు తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్, మంత్రులు జగదీష్ రెడ్డి , ఇంద్రకరణ్ రెడ్డి , దేవాదాయ శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.గతంలో వేణుగోపాలచార్యులు ఉత్తమ అర్చక, అర్చక రత్న, అర్చకభూషణ అవార్డులు పొందారు.యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నుండి పురస్కారంతో పాటు పలు పురస్కారాలు కూడా అందుకున్నారు.