వేణుగోపాలస్వామి ఆలయంలో కొనసాగుతున్న కళ్యాణ అధ్యయన ఉత్సవాలు
హుజూర్ నగర్ ఏప్రిల్ 4 (జనంసాక్షి): మండలంలోని బూరుగడ్డ లో వేంచేసియున్న శ్రీ శాల్మలికంద ఆది వరాహ లక్ష్మీనృసింహ వేణుగోపాల స్వామి ఆలయంలో మూడవ రోజు అధ్యయన ఉత్సవాలు కొనసాగుతున్నాయి. మంగళవారం ఈ సందర్భంగా ఉదయం సుప్రభాత సేవ, స్వామివారికి అమ్మవారికి ఆరాధన, దివ్య ప్రబంధ పారాయణం, ఆరగింపు, మంగళ శాసనం తదుపరి తీర్థప్రసాద గోష్టి జరిగాయి. అనంతరం తిరిగి సాయంత్రం నాలుగు గంటలకు గరుడసేవ తదుపరి గ్రామంలో ఊరేగింపు, పరమపద ఉత్సవం, ఆరగింపు, మంగళశాసనం, తీర్థప్రసాద వినియోగ కార్యక్రమాలు జరిగాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణ అధికారి ఎంపీ లక్ష్మణరావు, ఆలయ చైర్మన్ గండు సైదులు, ధర్మకర్తల మండలి సభ్యులు బండ్ల పవన్ కుమార్, ఆకుల గురవయ్య, గువ్వల రామకృష్ణ, ప్రార్థనబోయిన మట్టపల్లి, సురభి కుశేలు, నందిగామ అంజమ్మ, ముడుంబై శ్రీనివాసచార్యులు, సింగరాచార్యులు, శేషాచార్యులు, అనంత చార్యులు, ఆలయ అర్చకులు మనోహరాచార్యులు, హరీష్ కుమరా చార్యులు, కొత్త కళావతి, యరగాని పూర్ణ, గుడేపు నాగలింగం, గుడెపు వీరబాబు, ఆలయ సిబ్బంది జి.గోవిందరెడ్డి, యరగాని కిరణ్ గౌడ్, రమేష్, ఉపేందర్, సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు.