వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు

మునుగోడు సెప్టెంబర్02(జనంసాక్షి):
వైఎస్ఆర్ 13వ,వర్ధంతి సందర్భంగా శుక్రవారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టీపీసీసీ అధికార ప్రతినిధి పున్న కైలాస్ నేత ఆధ్వర్యంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందిన మహానేత అని ఆయన సేవలను కొనియాడారు.ఈకార్యక్రమంలో మాజీ మండలపార్టీ అధ్యక్షులు జాల వెంకన్నయాదవ్,మాజీ ఎంపీపీ పోలోగొని సత్యం,మాజీ ఎంపీటీసీ పందుల భాస్కర్,నన్నూరు విష్ణువర్ధన్ రెడ్డి,ఎస్సీసెల్ అధ్యక్షులు పందుల లింగస్వామ,పాల్వాయి చెన్నారెడ్డి,ఎండి అన్వర్,మేకల ప్రదీప్ రెడ్డి,మధు,ఆరేళ్ల సైదులు,వేణు,అయితగోని సైదులు,సునీల్ సులేమాన్,తదితరులు పాల్గొన్నారు.