వైఎస్‌ హయాంలో ప్రభుత్వ భూముల దారాదత్తం

హైదరాబాద్‌:వైఎస్‌ హయాంలో ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేశారని వి.హనుమంతరావు ఆరోపించారు.కొందరు కడప వాసులు,మిగతా ఆధికారులు హైదరాబాద్‌ను దోచుకున్నారు..ప్రభుత్వ న్యాయవాదులు ప్రైవేటు వ్యక్తులకు వత్తాసు పలుకుతున్నారన్నారు.2002 నుంచి జరిపిన పట్టణ భూక్రమబద్దీకరణలపై విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు.ఆంబర్‌పేటలో పాఠశాల భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారన్నారు.ఈ ప్రాంత భూసమస్యలు పరిష్కారం కాకపోతే ఆందోళన చేపడతానని ఆయన హెచ్చరించారు.