వైఎస్ సేవలు మరువలేనివి

* ఎస్సీ‌ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్ర శీనివాస్

జనహృదయ నేత మాజీ ముఖమంత్రి స్వర్గీయ
వైఎస్ రాజశేఖర్ రెడ్డి సేవలు మరువ లేనివని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి ఎర్ర శ్రీనివాస్ కొనియాడారు.శుక్రవారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన వైఎస్ రాజశేఖరరెడ్డి 13 వర్దంతి కార్యక్రమంలో
పాల్గొన్నారు. ఈ సందర్బంగా శ్రీనివాస్ మాట్లాడుతూ పేద,బడుగు బలహీణ వర్గాల ప్రజల ఆశాజ్యోతి‌గా వెలుగొందిన వైఎస్ తెలంగాణ రాష్ట్రంలో పేదలను ఆదుకునేందుకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేసిన ఘనత వైఎస్ దక్కుతుందన్నారు.రాష్ట్రం దారిద్ర్య రేఖకు దిగువనున్న పేదలు రోగాల బారిన పడితే లక్షల రూపాయలు వైద్య ఖర్చులు చెల్లించే ఆర్థిక స్థోమత‌లేదని ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించి పేదలు బడుగు బలహీణ వర్గాల ప్రాణాలు కాపాడి ప్రాణదాతగా నిలిచారన్నారు. వృద్దుల కోసం పెన్షన్ పథకాన్ని ప్రవేశ పెట్టి మదుసలి జీవితాలకు వైఎస్ అండగా నిలిచారన్నారు.పేద విద్యార్థులు ఉన్నత చదువు కోసం ఫీజు రిఅంబర్స్ మెంట్ పథకాన్ని ప్రవేశ పెట్టి ఎన్నో వేలమంది ‌విద్యార్థుల ఉన్నత చదువులు చదివేలా వైఎస్ సహకరించారన్నారు.నిల్వ నీడ లేని పేదలకు ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చి నీడ లేని బలహీణ వర్గాల ప్రజలకు నీడగా‌ నిలిచారన్నారు. దళితులకు మూడెకరాలు భూమి,ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన సిఎం కేసీఆర్ ఇప్పటికి అమలు చేసినా పాపాన పోలేదన్నారు. పేదల కోసం‌ డబుల్ బెడ్ రూం ఇళ్ళు‌ ఇచ్చి నిల్వ నీడ లేని పేదలను ఆదుకంటామని హామీ ఇచ్చిన సిఎం కేసీఆర్ దాని అమలులో పూర్తిగా విఫలమయ్యారన్నారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. పేదప్రజల సమస్యల పరిష్కారంలో ఆది నుండి ముందున్న పార్టీ కాంగ్రెస్సేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్నారని,కాంగ్రెస్ పార్టీని ఆదరించేందుకు సిద్దంగా ఉన్నారన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ దళిత ‌నేతలు రాజయ్య,న్యాత శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.