వైకాపా నేత రెహ్మాన్‌కు 14 రోజుల రిమాండ్‌

హైదరాబాద్‌ : ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయ దుందుభి మోగించడంతో సంతోషం పట్టలేక గాలిలోకి ఐదు రౌండ్లు కాల్పులు జరిపిన ఆ పార్టీ నేత రెహ్మాన్‌కు ఈస్ట్‌మారేడ్‌పల్లి జడ్జి 14 రోజుల రిమాండ్‌ విధించారు. ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయపథంలో దూసుకుపోతున్నట్లుగా ఫలితాలు వెలువడు తుండటంతో సంతోషం పట్టలేక ఆయన తన వద్ద ఉన్న తుపాకీతో గాల్లోకి ఐదు రౌండ్లు పేల్చాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెహ్మాన్‌కు అరెస్టు చేసి ఈస్ట్‌ మారేడ్‌పల్లిలోని 16వ ఎంఎం జడ్డి ఎదుట హాజరుపర్చగా న్యాయమూర్తి ఆయనకు 14రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించారు. అనంతరం అతడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.