వైశాలి నృత్యోత్సవ్‌ -2012లోగో ఆవిష్కరణ

విశాఖ సాంస్కృతికం: వైశాలి నృత్యోత్సవ్‌-2012లోగోను తమిళనాడు గవర్నర్‌ కె.రోశయ్య ప్రభుత్వ అతిథి గృహంలో ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నృత్యోత్సవాల నిర్వాహకుడు నటరాజ మ్యూజిక్‌ అండ్‌ డ్యాన్స్‌ అకాడెమీ వ్యవస్థాపకుడు బత్తిని విక్రమ్‌ గౌడ్‌ను సంప్రదాయ నృత్యాలను ఆదరిస్తున్నారంటై అభినందించారు. ఈ సందర్భంగా విక్రమ్‌ గౌడ్‌ మాట్లాడుతూ వైశాలి నృత్యోత్సవ్‌ సెప్టెంబర్‌ 8 నుంచి 11వరకు 4రోజుల పాటు నగరంలోని కళాభారతి ఆడిటోరియంలో నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కృష్ణా విశ్వవిద్యాలయం విశ్రాంత ఉప కులపతి ఆచార్య జేవీ ప్రాసద్‌ కంకటాల మల్లిక్‌, పైడాకృష్ణప్రసాద్‌, నటరాజ్‌ మ్యూజిక్‌ అండ్‌ డ్యాన్స్‌ అకాడెమీ ప్రతినిధులు డాక్టర్‌ శ్రీధర్‌ చిత్రా, డాక్టర్‌ లలిత్‌కుమార్‌ గుప్తా, పుష్కర్‌, ఐపీ సాయి జ్యోతి తదితరులు పాల్గొన్నారు.