వ్యాక్సినేషన్‌ సర్టిఫికేట్లపై మోదీ ఫోటో కట్‌


దిల్లీ 11 మార్చి (జనంసాక్షి) : ఎన్నికలు జరిగే నాలుగు రాష్ట్రా లు, కేంద్రపాలిత ప్రాంతంలో ఇక కొవిడ్‌ టీకా ధ్రువీకరణ పత్రంపై ప్రధాని మోదీ చిత్రం ఉండదు. ఎన్నికల సంఘం ఆదే శాల మేరకు వ్యాక్సినేషన్‌ సర్టిప ˜ికేట్లపై మోదీ ఫొటోను తొలగించి నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గురు వారం వెల్లడించింది. టీకా ధ్రువ పత్రాలపై మోదీ చిత్రాన్ని ఉంచ డాన్ని తప్పుపడుతూ.. తృణమూల్‌ సీనియర్‌ నేత డెరెక్‌ ఓబ్రీన్‌ ఇటీవల ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ప్రధాని తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని దానిలో ఆరోపించారు. ఈ ఎన్నికల సమయంలో పన్ను చెల్లింపుదారుల సొమ్ముతో మోదీ అనవసర ప్రచారం చేసుకోకుండా చూడాలంటూ తన ఫిర్యాదులో ఎన్నికల సంఘాన్ని అభ్యర్థించారు. దీనిపై స్పందించిన ఈసీ.. ఇటీవల కేంద్రానికి లేఖ రాసింది. ఎన్నికలు జరిగే నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతంలో కరోనా టీకా ధ్రువపత్రాలపై మోదీ చిత్రాలను వెంటనే తొలగించాలని ఈసీ అందులో పేర్కొంది. అయితే ఇతర రాష్ట్రాల్లో యథావిధిగా ప్రధాని చిత్రాన్ని కొనసాగించుకోవచ్చని తెలిపింది. ఎన్నికల కోడ్‌ విధి విధానాలను, నిబంధనలను కేంద్ర ఆరోగ్యశాఖ తప్పనిసరిగా పాటించాలని సూచించింది.ఈసీ ఆదేశాల మేరకు పశ్చిమ బెంగాల్‌, అసోం, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరీలో టీకా ధ్రువీకరణ పత్రంపై మోదీ చిత్రాన్ని తొలగించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే ఇతర రాష్ట్రాల్లో మాత్రం ప్రధాని ఫొటో ఉంటుందని తెలిపింది.