వ్యాధుల బారిన పడుతోన్న యువత ఫిట్‌ గ్లో స్థంస

హైదరాబాద్‌: గడిచిన దశాబ్దకాలంలో వ్యాధుల బారిన పడుతోన్న యువత సంఖ్య అనూహ్యంగా పెరుగుతోందని ఫిట్‌ గ్లో సంస్థ నిర్వహించిన సర్వే తేల్చింది. తీవ్రమైన పని ఒత్తిడి, అధిక పనిగంటలకు సరిపడా బలవర్థకమైప ఆహారం తీసుకోకపోవడమే ఇందుకు కారణమని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్వహించిన తమ సర్వే తేల్చి చెప్పిందని ఫిట్‌ గ్లో సంస్థ సీఈఓ వేణుగోపాల్‌ మూర్తి బుధవారం హైదరాబాద్‌లో చెప్పారు. పనికి సరిపడా ఆహారం తీసుకోకపోవడం వల్ల శరీరం తన పటుత్వం కోల్పోయి. 50 ఏళ్లకు రావలసిన జబ్బులు 30 ఏళ్లలోనే వస్తున్నాయని వివరించారు.  ఒత్తిడి, అధిక పనిగంటల నేపథ్యంలో యువత ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహజ  ఉత్పత్తులతో తయారైన ఆహారంపై దృష్టి సారించాలని సూచించారు.