శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద యువకుడు హత్య

శంషాబాద్ : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలోని వీకర్‌సెక్షన్ కాలనీకి చెందిన మధు (32) అనే వ్యక్తిని ఆగంతకులు గ్రానైట్ రాయితో మోది హతమార్చారు. ఈ సంఘటన శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఆ విషయాన్ని స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని…. డాగా స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఓ అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుడు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లోని కార్గోలో పనిచేస్తున్నాడని పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అలాగే మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారని పోలీసులు వెల్లడించారు. హత్య జరిగిన స్థలాన్ని మాదాపూర్ డీసీపీ కార్తికేయ, ట్రాఫిక్ ఏసీపీ సతీష్, ఎయిర్‌పోర్ట్ సీఐ సుధాకర్ సందర్శిం