శాంతిఖని గనిని సందర్శించిన బెల్లంపల్లి జూనియర్ సివిల్ కోర్టు జడ్జి.

బెల్లంపల్లి, మార్చ్ 4, (జనంసాక్షి )
బెల్లంపల్లి పట్టణంలోని శాంతిఖని గనిని శనివారం బెల్లంపల్లి జూనియర్ సివిల్ కోర్టు జడ్జి జి హిమబిందు సందర్శించారు. కుటుంబ సమేతంగా వచ్చిన జడ్జి గని చరిత్ర కోసం అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గని భూగర్భంలోకి వెళ్లి రక్షణతో చేసే బొగ్గు ఉత్పత్తి గురించి తెలుసుకున్నారు. ఆమె వెంట గని ప్రాజెక్టు అధికారి ఆర్ విజయప్రసాద్, మేనేజర్ సంజయ్ కుమార్ సిన్హా, రక్షణ అధికారి పి రాజు పాల్గొన్నారు.