శ్రీఏకాంబరి రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న కాంగ్రెస్ నేతలు.
ఆలయంలో కొలువు తీరిన పరమేశ్వరుని దర్శించుకుని ప్రత్యేక పూజలు.
కాంగ్రెస్ పార్టీ నేతలు సంపత్ కుమార్ శ్రీనివాస్ రెడ్డి.
తాండూరు సెప్టెంబర్ 25(జనంసాక్షి)
వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు డాక్టర్ సంపత్ కుమార్ మరియు ఆర్బిఎల్ పారిశ్రామికవేత్త శ్రీనివాస్ రెడ్డితో కలిసి శ్రీ ఏకాంబరి రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఆలయ అర్చకులు వేదమంత్రో చరణాలతో ఆశీర్వదిస్తూ తలపెట్టిన కార్యక్రమం విజయవంతం కావాలని తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో చేరిన శుభ సందర్భంగా రామలింగేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగిందని వెల్లడించారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా కలిసికట్టుగా కృషిచేసి కాంగ్రెస్ పార్టీకి పూర్వం తీసుకొస్తామని దీమా వ్యక్తం చేశారు. మరో మూడు రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి ఏ విధంగా కొనసాగించాలని విషయంపై చర్చించి ప్రజల్లోకి వెళ్తామని తెలిపారు.