శ్రీను బాబు పరామర్శలు
జనంసాక్షి , కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మంథని నియోజకవర్గ సోషల్ మీడియా పెండ్యాల రాజు సోదరుడు పెండ్యాల సంతోష్ ప్రథమ నెల కార్యక్రమానికి దుదిల్ల శీను బాబు శనివారం హాజరై వారి చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అలాగే ఎస్సీ కాలనీలో కల్వల రమేష్ అనారోగ్యంతో బాధపడుతుండగా వారిని శీను బాబు పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.