శ్రీరామ నవమి ఉత్సవాలను జయప్రదం చేయాలి

శ్రీరామ నవమి ఉత్సవాలను జయప్రదం చేయాలి
సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి) : జిల్లా కేంద్రంలోని విద్యానగర్ నందు నిర్వహించే శ్రీరామనవమి ఉత్సవాలను జయప్రదం చేయాలని 45వ వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సవరాల సత్యనారాయణ అన్నారు.ఈ నెల 30న విద్యానగర్ లోని బేబిమూన్ స్కూల్ సమీపంలో శ్రీసీతారాముల కళ్యాణ మహోత్సవంను నిర్వహించనున్నట్లు తెలిపారు.మంగళవారం వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ నివాసం నుండి లక్ష్మణ సమేత సీతారాముల ఉత్సవ విగ్రహాలను వేద పండితుల ఆశీర్వచనాలతో, శాస్త్రోక్తంగా మేళతాళాలతో, మంగళ వాయిద్యాలతో పట్టణ ప్రముఖుల సమక్షంలో విద్యానగర్ వీధుల గుండా ఊరేగింపుగా తీసుకొని వెళ్లి బేబిమూన్ పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన కళ్యాణ మండపం వద్దకు తీసుకుని వచ్చారు.అనంతరం వేద పండితులు పూజలు నిర్వహించారు.అనంతరం భక్తులకు తీర్ద ప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు గండూరి కృపాకర్, లయన్స్ క్లబ్ రీజనల్ చైర్మన్ చిలుముల శ్రీనివాస రెడ్డి, నూకల వెంకట రెడ్డి, గుండా శ్రీధర్, మిట్టపల్లి రమేష్, మంచాల శ్రీనివాస్, మిర్యాల శివకుమార్, వుల్లి రామాచారి,తెరటపల్లి సతీష్, ఎలగందుల సుదర్శన్, ఎల్లంబట్ల రమేష్. , బజ్జూరి శ్రీనివాస్, జూలకంటి నాగరాజు, బెజగం ఫణి, నల్లపాటి రమేష్, కక్కిరేణి శిరీష , నల్లపాటి అనురాధ , మల్లు వెంకట్రామరెడ్డి, పోతుగంటి మల్లికార్జున్, పారెపల్లి శ్రీనివాస్,రాచకొండ వేణు తదితరులు పాల్గొన్నారు.