శ్రీలంక పర్యటనకు భారత జట్టు ఖరారు

ముంబయి: శ్రీలంక పర్యటనకు భారత జట్టును బీసీసీఐ ఖరారు చేసింది. ఈ పర్యటనలో  భారత జట్టు ,శ్రీలంకలో ఒక టీ20,5 వన్డేల మ్యాచ్‌లు ఆడనున్నారు.  భారత జట్టుకు ధోని సారధ్యంలో వైస్‌ కేప్టేన్‌గా గౌతమ్‌ గంభీర్‌ ఎన్నికయ్యారు. సెహ్వాగ్‌, జహీర్‌ఖాన్‌కు జట్టులో అవకాశం దక్కగా,సచిన్‌కు విశ్రాంతి లభించింది. రవీంధ్ర జడేజాపై వేటు పడింది. జట్టులోని సభ్యులు: ధోని, సెహ్వగ్‌, కోహ్లి, గంభీర్‌, అశోక్‌ దిండా, ఆశ్విన్‌, ఉమేష్‌ యాదవ్‌, సురేష్‌ రైనా, వినయ్‌కుమార్‌, రోహిత్‌ శర్మ, ప్రజ్ఞన్‌ ఓజా, రహనే, మనోజ్‌తివారీ, రాహుల్‌ శర్మ.