శ్రీవారిని దర్శించుకున్న లోక్ సభ స్పీకర్

చిత్తూరు:తిరుమలలో శ్రీవారిని లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ శుక్రవారం దర్శించుకున్నారు. విశాఖ నగరంలో జరిగిన కామన్‌వెల్త్‌ పార్లమెంటరీ సదస్సులో పాల్గొనేందుకు ఏపీ రాష్ర్టానికి వచ్చిన స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ గురువారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. స్పీకర్‌కు ఆలయ అధికారులు మర్యాదలతో స్వాగతం పలికి స్వామివారి దర్శనం చేయించారు.