శ్రీవారి బ్రహ్మౌత్సవాలకు నేడు అంకురార్పణ

తిరుమల: శ్రీవేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఉత్సవాలకు సోమవారం అంకురార్పణ జరగనుంది దైవిక కార్యక్రమాల ప్రారంభానికి ముందు శుభసూచకంగా అంకురార్పణ కార్యక్రమాన్ని శాస్రోక్తంగా సాయంత్రం నిర్వహిస్తారు. ఈసందర్బంగా స్వామి వారికి వసంతోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను తితిదే రద్దు చేసింది శ్రీవారి అలయంలో మంగళవారం రాత్రి ద్వాజారోహణం జరుగుతుంది. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. తిరుపతిలో స్వీమ్స్‌స్నాతకోత్సవంలో పాల్గోని తిరుమలకు వస్తారు. అనంతరం వెంకటపథం ఔటర్‌ రింగురోడ్డును ప్రారంబించిరెండో దశ నిర్మాణం పనులకు, వకుళమాత పేరిట భవన సముదాయానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు