శ్రీశైలం జలాశయానికి తగ్గుముఖం పట్టిన వరదప్రవాహం

హైదరాబాద్‌: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. కర్నాటక ఎగువ ప్రాంతాల్లో వర్షాలు పడటంతో గత మూడు రోజులుగా ఉనబై రెండు వేల క్యూసెక్కుల వరద ప్రవాహం ప్రాజెక్ట్‌లోకి కొనసాగింది. నిన్న రాత్రి నుంచి ఎగువ జూరాలకు ప్రవాహం తగ్గింది. జూరాలలో నాలుగు యూనిట్ల ద్వారా విద్యుత్పత్తి చేస్తుండగా శ్రీశైలం ప్రాజెక్ట్‌లోకి 36వేల క్యూసెక్కులు మాత్రమే ప్రవాహం వస్తుంది.