శ్రీశ్రీశ్రీ వివేకనంద అగోలు సంఘ యా క్య 125వ జయంతి ఉత్సవాలు


బచ్చన్నపేట(జనం సాక్షి);
అచలర్షి శ్రీశ్రీశ్రీ వివేకానంద ఆగోలు సంఘయాక్య రాజ యోగీశ్వరుల వారి 125వ జయంతోత్సవము ఆచల యోగ ఫౌండేషన్ బచ్చన్నపేట యందు ఘనంగా జరిగాయి. పలు గ్రామాల నుండి దాదాపు 250 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీ బ్రహ్మానంద శ్రీధర్ స్వామి మాట్లాడుతూ..శ్రీ సంగ యాక్యుల వారు 18 98 వ సంవత్సరంలో జన్మించారు 2006 సంవత్సరంలో బ్రహ్మాండైక్యము చెందినారు వీరు అచల సిద్ధాంతమును ఈ ప్రాంతంలో వ్యాప్తి చేసినారు విశ్వ మానవ అన్యోన్య సహకారము లౌకిక మరియు పరమార్ధము చంద్రుడకై ప్రబో దాలు గావించినారు శ్రీ బ్రహ్మానంద శ్రీధర స్వామి అన్నారు. శ్రీమద్ భగవద్గీత విశేషతను కొనియాడారు గీతావ్యాప్తికై మే నెలలో గీతా యజ్ఞమును నిర్వహించుటకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల నుంచి సిద్దిపేట సిరిసిల్ల సోలాపురం పలు గ్రామాల నుంచి భక్తులు అనేకమంది పాల్గొన్నారు