-->

షబ్బీర్ కు ఇచ్చిన ఈ డి నోటీసులను వెనక్కి తీసుకోవాలని కామారెడ్డి జిల్లా కార్యదర్శి అబ్రబోయిన స్వామి డిమాండ్…

కామారెడ్డి ప్రతినిధి సెప్టెంబర్26 (జనంసాక్షి);
మాజీ మంత్రి షబ్బీర్ అలీ కి ఈడి నోటీసులు ఇవ్వడం హేయమైన చర్య అని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి అబ్రబోయిన స్వామి అన్నారు ఈ డి నోటీసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రం లొ సోమవారం అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా కార్యదర్శి అబ్రబోయిన స్వామి మాట్లాడుతూ మండల కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ప్రజా ఆదరణ చూసి ఓర్వలేక నేషనల్ హెరాల్డ్ కేసును తెరపైకి తెచ్చి కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని దృశ్యపన్నాగం పన్నిందన్నారు సోనియాగాంధీ రాహుల్ గాంధీ లకు ప్రజాధర్నా ఉన్న షబ్బీర్ అలీ వంటి నాయకులకు నోటీసులు ఇవ్వడం దారుణమని వారు తెలిపారు షబ్బీర్ అలీ రాజకీయ జీవితంలో ఎలాంటి అవినీతి లేదని మచ్చలేని నాయకుడిగా గుర్తింపు పొందరని వారు తెలిపారు అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా చేస్తూ బిజెపి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో దోమకొండ పార్టీ అధ్యక్షులు అనంత్ రెడ్డి పట్టణ అధ్యక్షులు సీతారాం మధు నాయకులు, సిద్ధ రెడ్డి, గోపాల్ రెడ్డి, రాజేశ్వర్, రసూల్, హమ్మద్, గంగారం, రమాకాంత్, తదితరులు పాల్గొన్నారు.