షరపోవా పరంజయం

లండన్‌ : వింబుల్డన్‌ మహిళల సిండిల్స్‌లో ఈ రోజు రెండు సంచలనాలు నమోదయ్యాయి. టాప్‌సీడ్‌ మరియా షరపోవా పరాజయం పాలైంది. జర్మనీ క్రీడాకారిణి లిసికి చేతిలో 4-6, 3-6 తేడాతో షరపోవా ఓడిపోయింది. బెల్జియం క్రీడాకారిణి కిమ్‌ క్లిస్టర్స్‌ కూడా మరో జర్మనీ క్రీడాకారిణి కెర్బర్‌ చేతిలో 1-6, 1-6 తేడాతో పరాజయం పాలైంది. వింబుల్డన్‌ తొలిరౌండ్‌లోనే వీనన్‌ ఇంటిముఖం పట్టడం ఒక సంచలనమైతే ఇప్పుడు షరపోవా, క్లిస్టర్స్‌ ఇద్దరూ ఓడిపోవడం ఈ వింబుల్డన్‌లో మరో సంచలన వార్త అయింది.