షార్ట్‌ సర్క్యూట్‌తో ఇల్లు దగ్థం

వరంగల్‌ : వరంగల్‌ జిల్లా ఘన్‌పూర్‌ మండలం చేర్పూరులో షార్ట్‌ సర్క్యూట్‌తో ఇల్లు దగ్థమైంది. ఈ ప్రమాదంలో రూ. 40 లక్షలు, నలభై తులాల బంగారం, 8 క్వింటాళ్ల బియ్యం, 40 క్వింటాళ్ల పత్తి, ఎల్‌ఐసీ, పొలం కాగితాలు దగ్థమైనట్లు బాధితులు వాపోయారు.