షీ టీం పోలీసులకు రాఖీలు కట్టిన విద్యార్ధులు

హైదరాబాద్‌,ఆగస్టు25(జ‌నం సాక్షి ): హైదరాబాద్‌ను భద్రమైన నగరంగా మార్చడమే తమ కర్తవ్యం అని నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు. సైఫాబాద్‌ లోని హాకా భవన్‌ భరోసా సెంటర్‌ లో జరిగిన రక్షాబంధన్‌ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. సీపీతో పాటు షీ టీమ్స్‌ పోలీసులకు విద్యార్థులు రాఖీ కట్టారు.ఆపదలో ఉన్న మహిళలకు రక్షణగా షీ టీమ్స్‌ భరోసా ఇస్తున్నాయని సీపీ అంజనీకుమార్‌ చెప్పారు. సిటీలో మహిళా భద్రతకు తాము కట్టుబడి ఉన్నామన్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో షీ టీమ్స్‌ ముందున్నాయని తెలిపారు. ఏదైనా నేరం జరిగితే వెంటనే తమకు సమాచారం అందించాలని, లొకేషన్‌ తో పాటు సమస్యను తమకు తెలిపితే నిమిషాల్లో పోలీసులు విూ ముందు ఉంటారని భరోసా ఇచ్చారు. ప్రతీ రోజు తమకు 600 నుండి 700 వరకు ఫిర్యాదులు అందుతున్నాయని వెల్లడించారు. ఆపదలో ఉన్నవాళ్లు షీ టీమ్స్‌ తో పాటు డయల్‌ 100కి కాల్‌ చేయాలని సూచించారు.