సంపత్ నగర్ లో ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి పరిణయ కళ్యాణ మహోత్సవం  కళ్యాణానికి హాజరైన ఎమ్మెల్యే హరిప్రియ దంపతులు

 టేకులపల్లి, మార్చి 3  (జనం సాక్షి): టేకులపల్లి మండలంలోని సంపత్ నగర్ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి పరిణయ కళ్యాణ మహోత్సవ కార్యక్రమంశుక్రవారం అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి ఇల్లందు శాసన సభ్యురాలు భానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ దంపతులు పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం వేద పండితులతో ఆశీస్సులు అందుకున్నారు. సంపత్ నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ధర్మకర్త గోపాలకృష్ణని బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్  దంపతులు అభినందించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తల కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ దంపతులను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ ఈ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సహాయ సహకారాలు అందించిన గోపాలకృష్ణకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆధ్యాత్మిక చింతనను ప్రతి ఒక్కరూ అలపరుచుకుంటే మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. ప్రతి ఒక్కరు కొంత సమయాన్ని దైవచింతనలో గడపాలన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి పరిణయ కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే దంపతులతో పాటు  బి ఆర్ ఎస్  పార్టీ మండల అధ్యక్షులు బొమ్మెర్ల వరప్రసాద్, మండల ప్రధాన కార్యదర్శి బోడ బాలునాయక్, జిల్లా నాయకులు కంభంపాటి చంద్రశేఖర్, బానోత్ రామ నాయక్, మండల నాయకులు చీమల సత్యనారాయణ, లక్కినేని శ్యామ్ ,భూక్య బాలకృష్ణ, మాలోత్ సురేందర్ ,కాలే ప్రసాదరావు,ఉండేటి బసవయ్య, ఇస్లావత్ బాలు, కుమ్మరి గురవయ్య, తదితరులు హాజరయ్యారు.