సచిన్‌ రిటైర్‌కు ఇదే సరైన సమయం

హైదరాబాద్‌: మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ వన్డే క్రికెట్‌ నుంచి రిటైర్‌ అయ్యేందుకు ఇదే సరైన సమయమని క్రికెట్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. వన్డే క్రికెట్‌లో ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్న ఈ మేటి క్రికెటర్‌ టెస్ట్న్‌క్రికెట్‌ వైపు పూర్తిస్థాయిలో దృష్టి పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని క్రీడావర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అంతర్జాతీయ క్రికెట్‌లో నానాటికీ వస్తున్న మార్పులకు అనుగుణంగా యువ క్రికెటర్లకు అవకాశం ఇచ్చేందుకు వీలుగా సచిన్‌ తప్పుకున్నాడని చెబుతున్నారు. భవిష్యత్తులో టీమ్‌ ఇండియా బలోపేతం అయ్యేందుకు కూడా సచిన్‌ నిర్ణయం దోహదపడుతుందని టీమ్‌  ఇండియా బలోపేతం అయ్యేందుకు కూడా సచిన్‌ నిర్ణయం ఓహదపడుతుందని హెచ్‌సీఏ కార్యదర్శి, మాజీ క్రికెటర్‌ ఎం. వి.శ్రీధర్‌, క్రికెట్‌ విశ్లేషకులు సుధీర్‌ మహావాది పేర్కొన్నారు.