సచివాలయం వద్ద భారీగా బలగాల మోహరింపు

హైదరాబాద్‌: రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని తెలంగాణవాదులు విద్రోహ దినంగా ప్రకటించిన నేపధ్యంతో సచివాలయం సమీపంలోని తెలుగుతల్లి, పొట్టి శ్రీరాములు విగ్రహాల వద్ద పోలీసులు భారగా మోహరించారు. ఎన్టీఆర్‌ మార్గంలో అన్ని దారుల వద్ద పోలీసులు తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.