సత్యసాయి బాబా ఆస్తుల సమాచారం వెల్లడి

అనంతపురం: సత్యసాయి బాబా ఆస్తులకు సంబంధించి కీలక సమాచారాన్ని ఆయన సహాయకుడు సత్యజిత్‌ ఆదివారం వెల్లడించారు. ఈ మేరకు ఆయన మీడియాకు సత్యసాయి డిక్లరేషన్‌ పేరుతో మెయిల్‌ పంపించారు. 1967లో సత్యసాయి రిజిస్ట్రేషన్‌ చేసిన పత్రాలను వెల్లడించారు. దీనిలో బాబా తన పేరుతో ఆస్తులు లేవని పేర్కొన్నారు. సత్యసాయి సంస్థలకు ట్రస్టీగానే చెప్పుకొన్నారు. దీనికి 1967లో ముంబయిలో రిజిస్ట్రేషన్‌ చేయించారు. దీనిని ట్రస్టు సభ్యులకు సత్యజిత్‌ అందజేశారు.