సన్నిధానాకి 3.50లక్షలు మంజూరు చేసిన ఎమ్మెల్యే
బోథ్ మండల కేంద్రంలోని అయ్యప్ప సన్నిధనానికి బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు ఏసీడీపీ నిధుల నుండి రూపాయలు 3.50 లక్షలు మంజూరు చేసినట్లు బోథ్ సర్పంచ్ సురేందర్ యాదవ్ తెలిపారు. సన్నిధానం లో హనుమాన్ దీక్షా స్వాములను కలిసి సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు పట్ల తెలంగాణ సర్కారు ఎల్లవేళలా సానుకూల దృక్పథంతోందని, ప్రజలకు సౌకర్యాలపై కేసీఆర్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిధులు మంజూరు చేస్తూ పనులను సకాలంలో పూర్తి చేస్తుందన్నారు. సన్నిధానంలో సౌకర్యల కల్పనపై తమ దృష్టి ఎల్లవేళలా ఉంటుందని ఈ నిధుల మంజూరు పట్ల ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ తన సొంత నిధుల నుండి సన్నిధానానికి రెండు ఫ్యాన్లను బహుకరించారు. ఈ ఫ్యాన్ లను స్వాములకు అందజేశారు. ప్రజలు ఎలాంటి సమస్యలు ఉన్నా దృష్టికి తీసుకొస్తే ఎమ్మెల్యే బాపూరావు దృష్టికి తీసుకెళ్లి ఆయన సహకారం తో సౌకర్యాల కల్పనకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ దీక్షా స్వాములు తదితరులు పాల్గొన్నారు.