సన్‌రైజర్స్ లోగో విడుదల
హైదరాబాద్ : ఐపీసీఎల్‌లో డెక్కన్ ఛార్జర్స్‌ను చేజిక్కించుకుని సన్ రైజర్స్‌గా పేరు మార్చిన సన్ గ్రూప్ గురువారం తమ జట్టు లోగోను హైదరాబాద్‌లో విడుదల చేసింది. ఈ సందర్భంగా సన్ గ్రూప్ ప్రతినిధులు మాట్లాడుతూ జట్టు కెప్టెన్‌గా ప్రస్తుతం కుమార సంగర్కర కొనసాగుతారని తెలిపారు. జట్టు కొత్త కోచ్‌గా టామ్‌మూడీని ఎంపిక చేసినట్లు వెల్లడించారు. జనవరిలో జరిగే ఐపీఎల్ ఆటగాళ్ల వేలం తర్వాత జట్టులో మార్పులు చేస్తామని పేర్కొన్నారు.